ఖమ్మం: అవినీతిలో వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రికార్డులు కొట్టారని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు ఆదివారం విమర్శించారు. తక్కువ సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని భారీగా దోపిడి చేసిన వాళ్లలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మొదటి వాడుగా ఉంటారని అన్నారు. అవినీతికి పాల్పడిన జగన్‌కు మద్దతుగా 26 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేయడం శోచనీయం అన్నారు.
కాగా ఉదయం హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం జగన్‌కు భారతీయ జనతా పార్టీ మద్దతు పలకడాన్ని ప్రశ్నించారు. అన్నాహజారేకు మద్దతు పలుకుతూనే జగన్‌కు బిజెపి అండగా నిలవడాన్ని తప్పుపట్టారు.