కాంగ్రెసును వీడటానికి జానారెడ్డి సిద్ధం: ఎర్రబెల్లి

మూకుమ్మడి రాజీనామాలతోనే తెలంగాణ సాధ్యమని చెప్పారు. త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని జానారెడ్డిని కోరినట్లు చెప్పారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ప్రజాప్రతినిధులను అవమానపర్చేలా మాట్లాడటం మానుకోవాలన్నారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులను ఆగౌరవపరిచేలా మాట్లాడితే అట్రాసిటీ కేసు పెడతామని, ప్రివిలేజ్ మోషన్ పెట్టి సభకు రప్పిస్తామని హెచ్చరించారు. అన్నాహజారేను చూసి కోదండరామ్ నేర్చుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications