చిరంజీవికి చెర్రీ నిశ్చితార్థానికి తెలంగాణ చిక్కులు

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ్ వివాహం నిజామాబాద్ జిల్లా దోమకొండ సంస్థానాధీశులకు చెందిన పురాతన కోటలో నిర్వహించాలని తలపెట్టారు. ఇందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కోటకు మరమ్మతులు చేపట్టారు. బుధవారం దోమకొండకు ఉపాసన తాత, రిటైర్డు ఐఏఎస్ అధికారి రాజా ఉమాపతిరావు, ఆయన సతీమణి, కొడుకు అనిల్, కోడలు శోభనతో కలిసి వచ్చి స్థానికులతో సమావేశమయ్యారు. దోమకొండను దేశంలోనే మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈనెల రెండో వారంలో కోటలోనే నిశ్చితార్థం జరిగే అవకాశమున్నట్లు సన్నిహితులు చెప్పారు.












Click it and Unblock the Notifications