వైయస్ వివేకాకు కాంగ్రెసు హ్యాండ్ ఇచ్చిందా?

YS Vivekananda Reddy
హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికల తర్వాత మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డికి కాంగ్రెసు పార్టీ ప్రాధాన్యత ఇవ్వలేదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుండి బయటకు పోయి సొంత కుంపటి పెట్టుకున్నప్పటికీ వివేకా మాత్రం తాను తన అన్న చెప్పిన కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పులివెందుల ఉప ఎన్నికలలోనూ వదినమ్మ వైయస్ విజయమ్మ పైనే పోటీ చేసి ఓడిపోయారు. మెజార్టీ వైయస్ కుటుంబ సభ్యులు సైతం వివేకాకు కాకుండా జగన్‌కే మద్దతు పలుకుతున్నారు. అయినప్పటికీ ఆయన కాంగ్రెసును వీడలేదు.

అయితే కాంగ్రెసు మాత్రం ఆయనను నిర్లక్ష్యం చేసినందు వల్లే వివేకా ఇటీవల కాంగ్రెసు నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 2వ తేదిన వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ వద్ద వైయస్ వివేకా పలువురు రాష్ట్ర కాంగ్రెసు నేతలపై విరుచుకు పడిన విషయం తెలిసిందే. వైయస్‌ను నేరస్తుడిగా చూపిస్తే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని అప్పటికీ కుదరక పోతే పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యల వెనుక తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఉప ఎన్నికలలో ఓడిపోయినా పార్టీ ఏదో పదవి వస్తుందని ఆయన భావించినట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఆయనను ఏ పదవీ వరించలేదు.

ఉప ఎన్నికల తర్వాత ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి మళ్లీ వస్తుందనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. కానీ అది కాలేదు. ఆ తర్వాత కూడా పలుమార్లు వివేకా తన పదవి కోసం రాష్ట్ర కాంగ్రెసు పార్టీలోని పలువురు నేతలను కలిశారని సమాచారం. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలను సైతం కలిసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయనకు ఎవరి నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనై కాంగ్రెసు నేతలపై విమర్శలు చేసినట్లుగా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉప ఎన్నికలలో వివేకానంద ప్రభావం కనిపించక పోవడంతో అధిష్టానం కూడా ఆయనకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని, అధిష్టానం మాట కాదని వీరు హామీ ఇచ్చే పరిస్థితి లేదని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వివేకాకు జగన్ పార్టీలో చేరాలని భావిస్తున్నారో లేదో కానీ వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బాబాయిని పార్టీలోకి తీసుకోవాలంటే పార్టీలో చర్చించాలని చెప్పి షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+