గాలి అక్రమ మైనింగ్‌ను సమర్థించను: సదానంద

గాలి సోదరుల అక్రమ మైనింగ్‌ను సమర్థించబోనని కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీరాములు రాజీనామా వల్ల గానీ గాలి జనార్దన్ రెడ్డి ఇళ్లలో సిబిఐ సోదాల వల్ల గానీ తమ ప్రభుత్వానికి ఏ విధమైన నష్టం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాగా, కుట్రలో భాగంగానే సిబిఐ సోదాలు జరిగాయని శ్రీరాములు ఆరోపించారు.
గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ వ్యాపారంతో తమకు ఏ విధమైన సంబంధం లేదని, అది గాలి జనార్దన్ రెడ్డి ప్రైవేట్ వ్యాపారమని బిజెపి వ్యాఖ్యానించింది. మైనింగ్ కుంభకోణం కేసు నుంచి గాలి జనార్దన్ రెడ్డి బయటపడతారనే ఆశాభావాన్ని బిజెపి వ్యక్తం చేసింది. రాజకీయంగా తమతో ఉన్నంత కాలం గాలి సోదరలుకు తమ మద్దతు ఉంటుందని కర్ణాటక ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ధనంజయ్ కుమార్ ఢిల్లీలో చెప్పారు.
గాలి జనార్దన్ రెడ్డి అరెస్టును దర్యాప్తులో భాగంగా ఆయన వ్యాఖ్యానించారు. సిబిఐ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసిందని ఆయన అన్నారు. దర్యాప్తులో అవసరమని భావిస్తే సిబిఐ ఎవరినైనా అదుపులోకి తీసుకోవచ్చునని, సిబిఐకి ఆ హక్కు ఉందని అన్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications