వైయస్ జగన్ ఢిల్లీకి ఎందుకొచ్చాడు: విహెచ్

జగన్‌పై సిబిఐ దర్యాప్తు చేయడంలో ఏ విధమైన కక్ష సాధింపు చర్య లేదని, కోర్టు ఆదేశాల మేరకే జగన్‌పై సిబిఐ దర్యాప్తు చేస్తోందని ఆయన మరోసారి అన్నారు. అవినీతిపరుడో, నీతిపరుడో జగన్ నిరూపించుకోవాలని ఆయన అన్నారు. అది నిరూపించుకోకుండా ప్రతిపక్షాల నాయకులను, ప్రధానిని కలవడమేమిటని ఆయన అడిగారు. మడమ తిప్పని నాయకుడివే అయితే ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జగన్ గురించి ఆలోచించే సమయం కూడా తమకు లేదని ఆయన అన్నారు.
వైయస్ జగన్‌ను బిజెపి వెనకేసుకొస్తోందని ఆయన విమర్శించారు. కల్మాడీ నుంచి కనిమొళి వరకు అందరి గురించీ మాట్లాడుతున్న బిజెపి నాయకులు జగన్ అవినీతి గురించి మాట్లాడడం లేదని, బిజెపి నాయకులు సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు జగన్‌ను సమర్థిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications