గాలి జనార్దన్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తి

Gali Janardhan Reddy
హైదరాబాద్: గాలి జనార్దన్ రెడ్డి, ఒఎంసి మైనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి కస్టడీ పిటిషన్‌పై సోమవారం సాయంత్రం వాదనలు ముగిశాయి. గాలి జనార్దన్ రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై కూడా వాదనలు ముగిశాయి. గాలి జనార్దన్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి ప్రత్యేక కోర్టులో సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. కస్టడీ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు సాగడంపై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. గాలి జనార్దన్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించే విషయంలో జాప్యం చేయడానికే సుదీర్ఘ వాదనలు చేస్తున్నారని విమర్శించింది.

కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డి అంటే అందరికీ భయమని సిబిఐ తరఫు న్యాయవాది విజయ్ టంకా సోమవారం కోర్టులో అన్నారు. మైనింగ్ అక్రమాలలో అధికారుల పాత్ర కూడా ఉందని వారి పాత్ర నిరూపించేందుకే గాలిని కస్టడీకి కోరుతున్నామని చెప్పారు. గాలిని విచారిస్తే కమిషన్లు తీసుకున్న వారి పేర్లు కూడా బయటకు వస్తాయని చెప్పారు. మైనింగ్ అక్రమాలను ఆపడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. వారు అక్రమ మైనింగ్ అడ్డుకోలేదన్నారు. అధికారుల పాత్ర నిర్ధారణ కోసమే కస్టడీ కోరుతున్నట్టు చెప్పారు. రోజు మూడు వేల ట్రక్కుల చొప్పున 29 టన్నుల మెట్రిక్ టన్నుల ఇనుమును తరలించారన్నారు.

అక్రమ మైనింగులో అధికారుల పాత్ర ఉందని సిబిఐ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారని అయితే వారినెందుకు అరెస్టు చేయలేదని గాలి జనార్ధన్ రెడ్డి తరఫు న్యాయవాది ఉదయ్ లలిత్ ప్రశ్నించారు. సరిహద్దు వివాదం పెండింగులో ఉన్నప్పుడు అక్రమ మైనింగ్ అని ఎలా చెప్పగలరన్నారు. సిబిఐ ఎఫ్ఐఆర్ మొత్తం తప్పుల తడక అన్నారు. అధికారులను అరెస్టు చేయకుండా కేసు ముందుకు సాగే అవకాశం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+