వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈలోగా చచ్చిపోతావేమోనంటే ఏం చెప్పాలి: కావూరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao and Kavuri Samba Siva Rao
న్యూఢిల్లీ: ఇంటికి వెళ్లేలోగా చచ్చిపోతావేమోనంటే ఏం చెప్పాలని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే మళ్లీ రాజీనామాలు చేస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగితే ఆయన ఆ విధంగా అన్నారు. కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో సమావేశానంతరం సోమవారం సాయంత్రం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము కోరామని ఆయన చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఏం చేయాలో అప్పుడు నిర్ణయించుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 8 కోట్ల 50 లక్షల మంది ప్రజల్లో ఒకే అభిప్రాయం ఉండడం సాధ్యం కాదని, అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులుగా తాము అభిప్రాయం వెల్లడిస్తున్నామని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే శాస్త్రీయంగా, నిర్దిష్టమైన ప్రమాణాలతో దేశాన్ని విభజించేందుకు నిర్ణయం తీసుకోవాలని తాము సూచించినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే అదే ప్రాతిపదికపై దేశాన్ని విభజించాలని సూచించామని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం వెనక ఎవరు ఉన్నారో, ఎందుకు ఉన్నారో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆజాద్‌తో చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సమస్య పరిష్కారంలో జాప్యం చేయవద్దని, జాప్యం చేస్తే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందనీ ఇరు ప్రాంతాల మధ్య శత్రుభావన పెరుగుతుందని చెప్పామని ఆయన అన్నారు. గులాం నబీ ఆజాద్‌తో ఇవే తమ చివరి చర్చలని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన అంశంపై తాము మళ్లీ ఢిల్లీకి రాబోమని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తు హైదరాబాద్ అంశంపై చర్చిద్దామని తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ప్రతిపాదనను తాము బలపరచడం లేదని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ చెప్పారు. వీలైనంత త్వరలో తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని ఆజాద్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము కోరినట్లు ఆయన చెప్పారు. ఉండవల్లి తాను అటువంటి ప్రతిపాదనే చేయలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారని కావూరి సాంబశివ రావు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆజాద్‌తో భేటీలో కావూరి సాంబశివరావు, శైలజానాథ్, గల్లా అరుణకుమారి, పాలడుగు వెంకటరావు, టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Congress Seemandhra MP Kavuri Sambasiva Rao rejected to say about what will they do, if party high command take pro Telangana stand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X