ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి గతే జగన్‌కు, మిడిసిపడితే అంతే: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ఒంగోలు: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి గతే పడుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో అన్నారు. అవినీతి డబ్బుతో మిడిసి పడితే జైలు తప్పదన్నారు. అవినీతికి పాల్పడితే ఊచలు లెక్కించక తప్పదన్నారు. వాన్ పిక్ భూముల పేరిట జగన్, బాలినేని తదితరులు దోచుకున్నారన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు తోడు దొంగలన్నారు. అవినీతి సొమ్ముతో జగన్ సాక్షి పత్రిక, ఛానల్ పెట్టారని విమర్శించారు. మైక్రో ఫైనాన్స్ ఏజెంట్లు గ్రామాల్లోకి వస్తే నిర్బంధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

అవినీతిపరులు తప్పించుకోలేరని అన్నారు. సెజ్‌ల పేరుతో పేదల భూములను కాంగ్రెసు ప్రభుత్వం దోచుకుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొక్కా నలగకుండా ఆకాశంలో తిరుగుతున్నారన్నారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి పనులు మాత్రం జరగటం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదు పాలన లేదన్నారు. ఈ నెల 18 నుంచి గ్రామస్థాయిల్లో కేంద్ర, రాష్ట్ర కార్యక్రమాలను స్తంభింపజేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో 82శాతం మంది అప్పుల్లో కూరుకు పోయారన్నారు. రైతులను ఆదుకోవాలంటే స్వామినాథన్ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. నేతలు పెరిగిన ఆదాయాన్ని పంచుకు తింటున్నారని ఆరోపించారు. అప్పులు, పన్నుల వేధింపుల్లో రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందన్నారు. కాగా ప్రకాశం జిల్లాలో ఆయన మంగళవారం నుండి మూడు రోజుల పాటు పర్యటిస్తారు. పంట నష్ట పోయిన రైతులను పరామర్శిస్తారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu said today that corruptionists will not escape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X