వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్సతో విభేదాలు లేవు, స్కీమ్స్ వైయస్‌వి కావు: సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం అన్నారు. మంత్రి వర్గ విస్తరణపై మీడియా ప్రశ్నించగా మీకు చెప్పే విస్తరణ చేస్తానని చెప్పారు. మంత్రులంతా తమ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నారు. ఆఫీసుకు వచ్చే పని చేయాలన్న రూలు ఏమీ లేదన్నారు. అందరి మంత్రుల నుండి తనకు ఫైల్స్ అందుతున్నాయని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసులో ఓ భాగం అన్నారు. బాన్సువాడ ఉప ఎన్నికల పైన రాష్ట్ర నేతల్లో తలా ఓ అభిప్రాయం ఉన్నప్పటికీ అంతిమ నిర్ణయం మాత్రం అధిష్టానందే అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు అధిష్టానం ఇచ్చిన స్వేచ్ఛతోనే సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. కాంగ్రెసులో ఎప్పుడూ వ్యక్తులు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమన్నారు. మోహన్ కందా ఇచ్చిన నివేదికను అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల సకల జనుల సమ్మెపై నివేదిక వచ్చాక స్పందిస్తానని చెప్పారు. నో వర్క్ నో పే నిర్ణయం ప్రభుత్వానిది కాదన్నారు. హైకోర్టు డైరెక్షన్ ప్రకారమే జరుగుతుందన్నారు. మంత్రులంతా తమ ఆస్తులను ప్రకటించాలని చెప్పారు.

వ్యాట్ పెంచక తప్పని పరిస్థితి ఉందన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై పరిశీలన జరుగుతోందని అయితే పెంచే ఉద్దేశ్యం లేదన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీలో కోతలుండవన్నారు. త్వరలో మరికొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెడతామని చెప్పారు. సంక్షేమ పథకాలు ఎత్తివేస్తారనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. అక్రమ విద్యుత్ కనెక్షన్ల గుర్తింపు కోసమే వ్యవసాయ బావులకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40 శాతం సేవలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 108, 104 సేవల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

English summary
CM Kiran Kumar Reddy said today that there is no differences with PCC chief Botsa Satyanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X