సకల జనుల సమ్మెపై ముఖ్యమంత్రి సీరియస్

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో సకల జనుల సమ్మెపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొనడంతో ఈ విషయంపై ఆయన సీరియస్‌గా దృష్టి సారించారు. సమ్మెపై ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. సకల జనుల సమ్మెకు మద్దతు పెరుగుతున్నందున దానిని కట్టడి చేసే ప్రయత్నాలు చేయాలని వారిని ఆదేశిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమ్మె ద్వారా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి సమ్మె జరిగినప్పటికీ దాని ప్రభావం కనిపించకుండా ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

సకల జనుల సమ్మె తీవ్రత దృష్ట్యా మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సకల జనుల సమ్మె విజయవంతం కాకుండా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఏం చేయాలో ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా తెలంగాణలో సమ్మె కారణంగా సీమాంధ్ర ప్రాంతం నుండి ఉద్యోగులను తీసుకు వచ్చి పని చేయించుదామనుకున్నప్పటికీ అది విజయవంతం కాదనే ఉద్దేశ్యంతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. కాగా ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా సమ్మెపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+