జగన్‌కు జయసుధ ఝలక్: రాజీనామాకు నిరాకరణ

Jayasudha
హైదరాబాద్: సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జలక్ ఇచ్చారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ రాజీనామా చేయనని చెప్పారు. రాజీనామాపై త్వరలో ఓ నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. రాజీనామాల వ్యవహారం ఓ డ్రామాలాగా కనిపిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు. తాను అందరిలాంటి నాయకురాలిని కాదన్నారు. ఆమోదించే అవకాశం ఉన్నప్పుడే నిజాయితీగా రాజీనామా చేస్తానని చెప్పారు. కాగా ఇప్పటికే అనంతపురం జిల్లా శాసనసభ్యుడు గుర్నాథ్ రెడ్డి మూడు రోజుల క్రితం జగన్‌కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన రాజీవ్ యువకిరణాల బహిరంగ సభకు అధ్యక్షత వహించి జై కాంగ్రెస్, జై వైయస్సార్ అని నినాదాలు చేశారు. జయసుధ నిర్ణయంతో జగన్ వర్గం నుండి రెండో ఎమ్మెల్యే జారి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా మంగళవారం మధ్యాహ్నం తెలంగాణలో సకల జనుల సమ్మెకు మద్దతుగా వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరు సిబిఐ ఎఫ్ఐఆర్‌లో ఉన్నదన్న కారణంతో సీమాంధ్రకు చెందిన 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన కొండా సురేఖ, కుంజా సత్యవతి, జయసుధ తెలంగాణ ఉద్యమం దృష్ట్యా రాజీనామా చేయలేదు. అయితే సమ్మెకు మద్దతుగా మంగళవారం మధ్యాహ్నం రాజీనామా చేస్తారని తెలిసింది. అయితే రాజీనామాకు ముందే జయసుధ తాను ప్రస్తుతం రాజీనామా చేయడం లేదని చెప్పటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+