కెసిఆర్‌పై విరుచుకుపడిన తెలంగాణ మంత్రులు

Sridhar Babu
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. తనపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు కూడా విరుచుకుపడ్డారు. తెలంగాణ పేరు చెప్పి ఎంత కాలం కెసిఆర్ మోసం చేస్తారని శ్రీధర్ బాబు అడిగారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణపై కెసిఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆయన అడిగారు. ప్రజల్లో తిరగనివ్వబోమని చెప్పడానికి కెసిఆర్ ఎవరని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెసు చూస్తూ ఊరుకోదని ఆయన అన్నారు.

కరీంనగర్ సభకు వచ్చిన జనాలను చూసి భయపెట్టాలని కెసిఆర్ చూస్తున్నారని, ఇక్కడ ఎవరూ భయపడరని శ్రీధర్ బాబు అన్నారు. విద్యుత్తు బందయితే ఇబ్బంది పడేది తెలంగాణ ప్రజలేనని ఆయన అన్నారు. కరీంనగర్ సభకు గద్దర్, విమలక్క, కొండా లక్ష్మణ్ బాపూజీలను ఎందుకు ఆహ్వానించలేదని ఆయన అడిగారు. శ్రీధర్ బాబుపై కెసిఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే తాము పదవులకు రాజీనామా చేసి కాంగ్రెసు కార్యకర్తలుగా పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

సమ్మె చేసే హక్కు ఉద్యోగులకు ఉందని, వారిపై చర్యలు తీసుకునే హక్కు కూడా ప్రభుత్వానికి ఉందని మంత్రి కె. జానా రెడ్డి అన్నారు. తెలంగాణకు సాధించడానికి తాము కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఇబ్బందులున్నా అధిష్టానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ నాయకులు పరస్పరం విమర్సలు చేసుకోవద్దని ఆయన సూచించారు. ఈ నెలాఖరులోగా తెలంగాణపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆయన అన్నారు. సానుకూల నిర్ణయం రాకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+