సచివాలయ ముట్టడి, తెలంగాణ టిడిపి నేతల అరెస్టు

బైఠాయింపు జరిపిన తెలంగాణ తెలుగుదేశం నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టయినవారిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, కడియం శ్రీహరి, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని తెలంగాణ తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగులపై అణచివేత చర్యలకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు.


Click it and Unblock the Notifications