మహేష్‌బాబు ఇంటికి సిబిఐ, నమ్రత స్టేట్‌మెంట్ రికార్డు

వైయస్ జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సిబిఐ విచారణను కొనసాగిస్తోంది. మీనాక్షి ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు బుధవారం సిబిఐ ముందు హాజరయ్యారు. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి వరుసగా 12వ రోజు సిబిఐ ముందు హాజరయ్యారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడంతో విజయసాయిరెడ్డికి రక్షణ కల్పించారు. గుంటూరు జిల్లాలోని వాన్‌పిక్ భూములను సిబిఐ అధికారులు పరిశీలించే అవకాశాలున్నాయి. అలాగే, నిజాంపట్నం, పిట్లవానిపాలెం, బాపట్ల తదితర ప్రాంతాల్లో కూడా సిబిఐ సందర్శించే అవకాశాలున్నాయి. మాజీ ఐపియస్ అధికారి, మాజీ మంత్రి రంగయ్యనాయుడు బుధవారం సిబిఐ ముందు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications