తెలంగాణ సకల జనుల సమ్మెపై బాబు నో కామెంట్

2జీ స్పెక్ట్రమ్, కామన్వెల్త్ కుంభకోణం, నల్లధనం, మైనింగ్ అక్రమాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు.కాంగ్రెసు పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందని ఆనయ అన్నారు. వస్త్రాలపై వ్యాట్, ఎరువులు, గ్యాస్, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచేసి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. అన్ని రకాల పన్నులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను లూఠీ చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ అవినీతిపై అన్నా హజారే వీధులలోకి వచ్చి పోరాటం చేయటంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు అవినీతిపై చైతన్య వంతులవుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతిని పెంచి పోషించారన్నారు. అందుకు ఉదాహరణే గాలి జనార్దన్‌రెడ్డి అని చెప్పారు. ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తే బంగారు ఆభరణాలు, వస్తువులు ఎన్ని లభించాయో చెప్పాల్సిన పనిలేదన్నారు. పేదలు చిన్నం మంగళసూత్రానికి నోచుకోకపోయినా, అవినీతి పరుల ఇళ్లల్లో మాత్రం కిలోల కొద్ది బంగారం లభిస్తోందన్నారు.
ప్రజలలో సానుభూతిని పెంచుకునేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తమ పార్టీపై నిందారోపణలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌పై రాజీలేని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీయేనన్నారు. ఆ విషయం గమనించకుండా ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ప్రజలలో సానుభూతి కోసం టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని జగన్ విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications