ఎమ్మెల్యేలు హరీష్ రావు, విష్ణువర్ధన్ రెడ్డి అరెస్టు

దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు వెంటనే వెళ్లి పోవాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఆర్టీసి కార్మికులు సైతం సకల జనుల సమ్మెలో భాగస్వాములు కావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వెళ్లి బస్సులు నడపాలని చూస్తే ఆ బస్సులు తిరిగి డిపోలకు చేరవన్నారు. కాగా ఆందోళనకారులు బస్ భవన్ ఎదురుగా మూడు సెట్విన్ బస్సులపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. హరీష్, విష్ణువర్ధన్ రెడ్డి, నాయినిలను అరెస్టు చేయడాన్ని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్, ఆర్టీసి జెఏసి, తెలంగాణ ఎన్‌ఎంయు తదితరులు ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications