తెలంగాణపై బొత్సతో కెటిఆర్, కోదండరామ్ భేటీ

Botsa Satyanarayana
హైదరాబాద్: సకల జనుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను బుధవారం సాయంత్రం కలిశారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఇప్పించేందుకు మధ్యవర్తిత్వం నెరపాలని వారు బొత్స సత్యనారాయణను కోరినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బొత్స సత్యనారాయణ మొదటి నుంచి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర పిసిసి చీఫ్‌గా వాస్తవ పరిస్థితిని పార్టీ అధిష్టానానికి తెలియజేయాలని వారు సూచించినట్లు తెలిసింది.

బొత్స సత్యనారాయణతో భేటీ ముగిసిన తర్వాత వివరాలను కెటి రామారావు గానీ కోదండరామ్ గానీ వెల్లడించలేదు. సకల జనుల సమ్మెపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడకపోవడాన్ని కెటి రామారావు తప్పు పట్టారు. తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోలేని స్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నా సమయం కర్రు వాత పెట్టే నైపుణ్యం ప్రజలు చూపిస్తారని, ఆ రుచిని చంద్రబాబు చూడక తప్పదని ఆయన అన్నారు. బస్సు ప్రమాదంలో మరణించిన ఆటో డ్రైవర్ మల్లేష్‌ కుటుంబానికి పది లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాగా, సకల జనుల సమ్మె వల్ల తెలంగాణ అంతా స్తంభించిందనడం సరి కాదని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. తెలంగాణపై తమ పార్టీ తరఫున చర్చలు జరుపుతున్నామని, చర్చలు ముగిసే వరకు సహనం వహించాలని ఆయన బుధవారం న్యూఢిల్లీలో అన్నారు. తెలంగాణ విషయంలో ప్రతి ఒక్కరు కూడా విజ్ఞత ప్రదర్శించాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+