బాన్సువాడ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బొత్స

తెలంగాణపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని ఆయన చెప్పారు. కొన్ని పార్టీలు తెలంగాణపై యు - టర్న్ తీసుకోవడం వల్లనే నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. జై తెలంగాణ నివాదంతోనే తాను ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు శ్రీనివాస గౌడ్ చెప్పారు. తెలంగాణ ఇచ్చేది తెచ్చేది కాంగ్రెసు పార్టీయేనని, కాంగ్రెసు పార్టీయే తెలంగాణ ఇస్తుందని ప్రజలు కూడా నమ్ముతున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో తాను సీనియర్ నాయకుల సహకారం తీసుకుంటానని ఆయన చెప్పారు. తెలంగాణ స్టీరింగ్ కమిటీని కూడా తాను ప్రచారానికి తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications