కోఠీలో ఉద్రిక్తత, శ్రీనివాస్‌తో మాట్లాడిన ముఖ్యమంత్రి

బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కిందికి దిగిరావాలని శ్రీనివాస్‌ను కోరారు. కోఠీలో తెలంగాణవాదులు విధ్వంసానికి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని, పరిస్థితి విషమించకూడదనే ఉద్దేశంతో తాము వాటిని ప్రసారం చేయడం లేదని జి 24 గంటలు న్యూస్ చానెల్ చెబుకుంటోంది. కోఠీ పరిసర ప్రాంతాల్లో తెలంగాణవాదులు దుకాణాలను మూయిస్తున్నారు. తన తల్లిదండ్రుల బాధ తనకు తెలుసునని, అయితే తనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముఖ్యమని శ్రీనివాస్ అంటున్నాడు.












Click it and Unblock the Notifications