బాబుకు షాక్, కొమ్మి లక్ష్మయ్యనాయుడి రాజీనామా

చంద్రబాబు ఇప్పటికీ తాను ముఖ్యమంత్రిని అనే భ్రమలోనే ఉన్నారని, దాంతో కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. 37 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన తనను చంద్రబాబు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా తన నియోజకవర్గంలో ముగ్గురిని ఇన్‌చార్జిలుగా నియమించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఇందుకు తాను మనస్థాపం చెంది రాజీనామా చేశానని వివరించారు. వరుసగా రెండుసార్లు ఓడిపోయిన జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒక్కడినే సర్వేపల్లి నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నియమించారని ఆయన చెప్పారు.తన నియోజకవర్గంలో ముగ్గురిని ఎందుకు ఇంచార్జీలుగా నియమించారని అడిగితే చంద్రబాబు తనతో దురుసుగా మాట్లాడారని, అందుకే తాను రాజీనామా చేశానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications