దిగొచ్చిన శ్రీనివాస్, పది గంటల ఉత్కంఠకు తెర

శ్రీనివాస్ హోర్డింగ్‌పైకి ఎక్కి దూకుతానని బెదిరించడంతో హైదరాబాదులోని కోఠీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణకు చెందిన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వచ్చి రాజీనామాలు చేస్తామని హామీ ఇస్తేనే తాను కిందికి దిగుతానని అతను పట్టుబడుతున్నాడు. శ్రీనివాస్‌తో ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి కూడా ఫోన్లో మాట్లాడారు. హోర్డింగుపైనుంచి దిగి రావాలని ఆయన శ్రీనివాస్‌కు సూచించారు. పలువురు తెలంగాణ నాయకులతో పాటు టీవీ చానెళ్లు విజ్ఞప్తి చేసినా అతను వినడం లేదు. అతని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమకు శ్రీనివాస్ ఒక్కడే కొడుకని చెప్పుకుంటూ దిగిరావాలని అతన్ని కోరారు.
బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కిందికి దిగిరావాలని శ్రీనివాస్‌ను కోరారు. కోఠీలో తెలంగాణవాదులు విధ్వంసానికి దిగినట్లు వార్తలు వచ్చాయి. విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని, పరిస్థితి విషమించకూడదనే ఉద్దేశంతో తాము వాటిని ప్రసారం చేయడం లేదని జి 24 గంటలు న్యూస్ చానెల్ చెబుకుంది. కోఠీ పరిసర ప్రాంతాల్లో తెలంగాణవాదులు దుకాణాలను మూయించారు.












Click it and Unblock the Notifications