సమ్మె ఎఫెక్ట్!: గాలి బెయిలు పిటిషన్ మళ్లీ వాయిదా

కాగా గాలి, శ్రీనివాస్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలన్న సిబిఐ గురువారం కౌంటర్ దాఖలు చేసింది. గాలికి బెయిలు ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని తన కౌంటర్ ఫైల్లో పేర్కొంది. బెదిరింపుల ద్వారానో మరో రూపంలోనో సాక్ష్యులను సైతం ప్రభావితం చేసే అవకాశముందని చెప్పారు. ఈ కేసులో ఇంకా పలువురు అధికారులను విచారించాల్సి ఉందని చెప్పారు. విచారణ అంతిమ దశలో ఉండగా బెయిలు మంజూరు చేస్తే సాక్ష్యాలు నాశనం చేసే అవకాశం కూడా ఉందని సిబిఐ అనుమానం వ్యక్తం చేసింది.
శ్రీనివాస్ రెడ్డి ఎండీగా ఎప్పుడూ సంతకాలు చేయలేదని గాలి, అతని సతీమణి అరుణలు మాత్రమే సంతకాలు చేశారని చెప్పారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అక్రమ మైనింగులో గాలి చురుగ్గా వ్యవహరించారన్నారు. గాలి రెండోసారి బెయిలు పిటిషన్ లో ఎలాంటి మార్పులు లేవని అలాంటప్పుడు ఆయనకు బెయిలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. గాలి అనుచరులు చాలామంది పరారీలో ఉన్నారన్నారు. ప్రాథమిక ఆధారాలతోనే గాలిని, శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications