ఇదే చివరి అవకాశం: అధిష్టానానికి టి-కాంగ్రెసు హెచ్చరిక

శుక్రవారం సకల జనుల సమ్మెలో పాల్గొంటామన్నారు. గన్ పార్కు నుండి సచివాలయానికి ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీగా వెళతామని చెప్పారు. ఎఏసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింఘ్వీ వ్యాఖ్యలు అవగాహనా రాహిత్యమన్నారు. 25 తర్వాత ఢిల్లీ నుండి తెలంగాణపై సానుకూల స్పందన రాకపోతే కఠిన నిర్ణయం తప్పదన్నారు. కాంగ్రెసు నేతలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిఎంతో పాటు గవర్నర్ కేంద్రానికి తప్పుడు వివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఏర్పడిన వాస్తవ పరిస్థితులు కేంద్రానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు మేము అండగా ఉంటామన్నారు. ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదన్నారు. మంత్రులకు తెలియకుండా ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కిలో బియ్యం ప్రకటించారన్నారు. ఇక్కడి ప్రజలకు కావాల్సింది పథకాలు కాదని తెలంగాణ అన్నారు. ఈ సమావేశంలో కెకెతో పాటు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ఎంపీ మందా జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. కాగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి వారు తెలంగాణ, రాష్ట్ర పరిస్థితులు, సింఘ్వీ వ్యాఖ్యలపై లేఖ రాశారు.












Click it and Unblock the Notifications