పొన్నంపై కిరణ్ కుమార్ ఘాటు వ్యాఖ్య, ఆపై క్షమాపణ

అయితే, ముఖ్యమంత్రితో జరిగిన తెలంగాణ నేతల భేటీ గరంగరంగా జరిగినట్లు సమాచారం. పొన్నం ప్రభాకర్‌పై ముఖ్యమంత్రి తీవ్రంగా విరుచుకుపడ్డారు. దొంగ నివేదికలు పంపి, ముఖ్యమంత్రిని అయ్యానంటూ నాపై ఎలా విమర్సలు చేస్తావని ముఖ్యమంత్రి పొన్నంపై మండిపడ్డారు. తాను అలా అనలేదని పొన్నం ప్రభాకర్ చెప్పినా ఆయన పట్టించుకోలేదు. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ అంటూ పొన్నంపై ఆయన విరుచుకుపడినట్లు తెలుస్తోంది. దీనికి కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ నాయకులు కె. కేశవరావు, జానా రెడ్డి తదితరులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణపై తాను కేంద్రానికి నివేదికలు పంపడం లేదని ముఖ్యమంత్రి వారితో చెప్పారు.
తాను నివేదికలు పంపడం లేదని ముఖ్యమంత్రి తమతో చెప్పారని భేటీ అనంతరం కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణపై కేంద్రానికి వాస్తవాలతో కూడిన నివేదికను పంపించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ఇచ్చిన గడువులోగా నిర్ణయం చేయాలని కేంద్రానికి లేఖ రాయాలని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications