2జి స్కామ్‌పై రాజీనామాకు సిద్ధపడిన చిదంబరం?

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై సీనియర్ మంత్రులు ప్రణబ్ ముఖర్జీకి, చిదంబరానికి మధ్య ఏ విధమైన విభేదాలు లేవని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షం ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గబోదని ఆయన చెప్పారు. చిదంబరం 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులను ఆపి ఉండగలిగేవారంటూ ప్రణబ్ ముఖర్జీ ప్రధానికి రాసిన లేఖ బయటకు వచ్చింది. దీంతో చిదంబరం చిక్కుల్లో పడ్డారు. చిదంబరానికి కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ పూర్తి మద్దతు ప్రకటించారు. రాజీనామా చేయాలని చిదంబరాన్ని అడగబోమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications