రాజీనామా లేఖలతో వచ్చిన టిడిపి తెలంగాణ నేతలు

ప్రత్యేక రాష్ట్రం సాధించే దిశలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించే రాజీనామాలకు తాము సిద్ధమని తాము రాజీనామాలతో సిద్ధంగా ఉన్నామని కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి సైతం తమతో కలిసి రావాలని మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ కేవలం తమ సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకే ప్రయత్నాలు చేస్తోందన్నారు. మర్రి చెన్నారెడ్డి 400 మంది తెలంగాణవాదులను బలి తీసుకుంటే టిఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర రావు 600 మందిని బలి తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెసు కలిసి వచ్చినా రాకున్నా తాము ఖచ్చితంగా రాజీనామా చేస్తామని మరో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అయితే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తమతో కాంగ్రెసు సైతం కలిసి వస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. కాలాయాపన సరికాదన్నారు. తాము రాజీనామా చేసి తెలంగాణ నేతలపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications