చిరంజీవిని ఆడిపోసుకున్న టిడిపి అధినేత చంద్రబాబు

Chandrababu Naidu
అనంతపురం: గత ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీయే కారణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆడిపోసుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆర్.కె.ఫంక్షన్ హాల్‌లో అధ్యక్షుడు బీ కే పార్థసారధి ఆధ్వర్యం లో జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడారు. 2009 ఎన్నికలప్పుడు ఓ సినిమా పార్టీ పెట్టారని, అది సామాజిక న్యాయమని ముందుకొచ్చిందని, దీనివల్ల ఆ ఎన్నికల్లో కొంతతేడాతో తాము ఓటమి చూడాల్సి వచ్చిందని ఆయన చిరంజీవి ప్రజారాజ్యం పా్రటీని ఉద్దేశించి అన్నారు. ఆ రోజు కూడా ఒక్కశాతం ఓ ట్లతోనే మనం అధికారం కోల్పో యామని ఆయన చెప్పారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చుపడిందన్నారని, వైయస్ రాజశేఖర రెడ్డి దేశంలో ఏ నాయకుడూ చేయని అవినీతి చేశాడని ఆయన విమర్శించారు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖా యమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభు త్వ పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఇలాంటి సమయంలో మనం ప్రజలకు అండగా నిలబడాలని, అందుకే ఈ యాత్రలు చేస్తున్నామన్నానని ఆయన అన్నారు. తన కుటుంబం కోసమైతే తాను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని, నన్నూ పార్టీనీ నమ్ముకున్న ప్రజల కోసమే ఇంత కష్టపడుతున్నానని ఆయన అన్నారు. ప్రాణం ఉన్నంతవరకు మీ కోసమే పనిచేస్తానని ఆయన అన్నారు. రాబోయే కాలం చాలా కీలకమైనదని ప్రతి కార్యకర్త ఈ రెండేళ్లు నిద్రమాని పనిచేసి మనరాష్ట్రాన్నికాపాడుకోవడానికి సహకరించాలని ఆయన అన్నారు.

అవినీతి, అక్రమాలపై వేలెత్తిచూపితే మనమీదే ఎదురుదాడి చేశారని మనం చెప్పిందే నేడు నిజమై ఆ అక్రమార్కులు జైలుపాలు అవుతున్నారన్నారు. ఓఎంసీ అక్రమ సొమ్మును జిల్లాకు ఖర్చుపెట్టి ఉంటే ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదన్నారు. ప్రభుత్వ పెద్దలు సెజ్‌ల పేరుతో భూములను లాక్కుని రిల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగించి జేబులు నింపుకున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్, సైన్సు సిటీల పేరుతోఇదే తరహాలో మోసగించారని ఆయన ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+