పార్టీ తెలంగాణ నేతల ఒత్తిడికి తలొగ్గిన అధిష్టానం

Sonia Gandhi
న్యూఢిల్లీ: తెలంగాణపై సొంత పార్టీ నాయకుల ఒత్తిడికే కాంగ్రెసు అధిష్టానం దిగి వచ్చినట్లు కనిపిస్తోంది. తమకు ఇచ్చిన గడువు ముగిసింది కాబట్టి వెంటనే నివేదికను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించాలని, ఆ వెంటనే పార్టీ కోర్ కమిటీలో చర్చించి నిర్ణయం వెల్లడించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌పై తీవ్రమైన ఒత్తిడి పెట్టారు. తాము గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని, తాము హైదరాబాదుకు తిరిగి వెళ్లి చేసేది కూడా ఏమీ లేదని, ఇక్కడే ఉంటామని వారు తెగేసి చెప్పారు. మీరు వద్దన్నా మిమ్మల్ని కలుస్తూనే ఉంటామని, నిర్ణయం వెలువడే వరకు తిరిగి వెళ్లేది లేదని వారు చెప్పారు.

పరిస్థితిని గమనించిన ఆజాద్ ఆ వెంటనే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఢిల్లీకి పిలిలించి ఆజాద్ చర్చలు జరిపారు. వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజనకు అనుకూలంగానే ఉండడంతో పరిస్థితిని ఆయన వివరించినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలవారీగా పార్టీ పరిస్థితిపై కూడా ఆజాద్ సోనియా గాంధీకి వివరించినట్లు సమాచారం. పార్టీపరంగా నిర్ణయం తీసుకుని వెల్లడిస్తే తప్ప ప్రమాదం నుంచి బయటపడలేదమని ఆజాద్ చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా నిర్ణయం ప్రకటిస్తే, తెలుగుదేశం వంటి పార్టీలను ఆత్మరక్షణలో పడేయవచ్చునని ఆయన చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై రాజకీయ నిర్ణయం ప్రకటించాల్సిందేనని ఆజాద్ గట్టిగా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

తెలంగాణ నాయకుల ఒత్తిడి, ఆజాద్ నివేదిక నేపథ్యంలో తెలంగాణపై చర్చించడానికి మాత్రమే శుక్రవారం సాయంత్రం పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కోర్ కమిటీ సభ్యుడు కాకపోయినప్పటికీ ఆజాద్‌ను ఆహ్వానించారు. కోర్ కమిటీ సమావేశం నేపథ్యంలో అటు ఢిల్లీలోనూ ఇటు హైదరాబాదులోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+