వైయస్ జగన్ ఆస్తులపై ఈడి దర్యాప్తు వేగవంతం

YS Jagan
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తులపై కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) వేగవంతం చేసింది. వేల కోట్ల రూపాయలతో, పదుల సంఖ్యలో కంపెనీలతో ముడిపడి ఉండడంతో కేసు దర్యాప్తు కోసం వివిధ విభాగాలతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దీనిపై చర్చల కోసం ఇప్పటికే వివిధ విభాగాల అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. ఇందుకు శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా ఆస్తుల కేసును మాదిరిగా జగన్ ఆస్తుల కేసుపై కూడా విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈడి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఆగస్టు 30వ తేదీ ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది. ఇదే సమయంలో జగన్ ఆస్తులపై సిబిఐ కూడా దర్యాప్తు జరుపుతోంది. జగన్ ఆస్తుల కేసు విచారణకు అవసరమైన సమాచారాన్ని ఈడి సిబిఐతో పంచుకుంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సమాచారాన్ని కూడా తీసుకుంది. కొన్ని ఫైళ్లను ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. వాటి ఆధారంగా ఈడి ఓ నివేదిక తయారు చేసింది. ఈడి ఏర్పాటు చేసే ప్రత్యేక బృందంలో ఆదాయం పన్ను శాఖ అధికారులు కూడా ఉంటారని తెలుస్తోంది. సిబిఐ, ఆదాయం పన్ను శాఖ సహకారం ఈడికి అత్యంత ఆవశ్యకం.

ఢిల్లీలోనే ఉన్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ శుక్రవారం జరిగే ఈడి ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదు నుంచి అధికారుల బృదం ఒకటి గురువారం ఢిల్లీకి చేరుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+