కెసిఆర్‌కు హైదరాబాదులోనే బుద్ధి చెబుతాం: జెసి సోదరుడు

హైదరాబాదులోని బాచుపల్లి చౌరస్తాలో దివాకర్ ట్రావెల్సు గ్యారేజీ ఉంది. గురువారం రాత్రి ఓ బస్సు విజయవాడకు వెళ్లేందుకు గ్యారేజి నుండి బయటకు వచ్చింది. బస్సు నెంబర్ ఎపి-02-టిఎ-0378. ఈ బస్సు నిజాంపేట నుండి రాజీవ్ గాంధీ కాలనీ మార్గమధ్యలోకి రాగానే ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వచ్చి బస్సుపై పెట్రోలు పోసి నిప్పంటించారు. మంటలు ఎగిసి పడుతుంటడంతో డ్రైవర్, క్లీనర్ బస్సులో నుండి దూకేశారు. వారు వెంటనే దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా దుండగులు నిప్పంటించే ముందు అందులోనే ఉన్న డ్రైవర్, క్లీనర్‌ను దిగాలని కూడా హెచ్చరించలేదని సమాచారం.












Click it and Unblock the Notifications