ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసానికి యత్నం, లాఠీఛార్జ్

TRS attack on NTR statue
మహబూబ్ నగర్/వరంగల్: దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు కొందరు ప్రయత్నించడం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. తెలంగాణ పేరుతో ప్రజలను తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన దిష్టి బొమ్మను ఉదయం దగ్ధం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తెరాస కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు.

అప్రమత్తమైన పోలీసులు తెరాస కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు ఎంతకూ తగ్గలేదు. పార్టీ కార్యాలయంలోని తెలుగుదేశం పార్టీ జెండాలను దగ్ధం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. అనంతరం వారు కలెక్టరేట్‌లో ఉన్న దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. విగ్రహాన్ని చెప్పులతో కొట్టారు. పోలీసులు వారి చర్యలను అడ్డుకున్నారు. కాగా వరంగల్ జిల్లాలోనూ ఓ మహిళ విగ్రహాన్ని సుత్తితో పగుల గొట్టే ప్రయత్నం చేసింది. పెట్రోలు పోసి తగుల బెట్ట పోయింది. పోలీసులు ఆమె చర్యలను అడ్డుకున్నారు. సుత్తితో దాడి చేయడంతో విగ్రహం పాక్షికంగా దెబ్బతింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+