తెలంగాణ ఆందోళనకారులపై దండెత్తిన ముఖ్యమంత్రి

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దండెత్తారు. హైదరాబాదు కాంగ్రెసు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన శనివారం మాట్లాడారు. ఉద్యమాలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలి గానీ చెడు చేసే విధంగా ఉండకూడదని, చెడు చేస్తున్నవారిని ప్రజలే ప్రతిఘటిస్తారని ఆయన అన్నారు. ఉద్యమం వల్ల విద్యుత్తు సమస్య ఏర్పడుతోందని, బస్సులు నడవడం లేదని, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. బంద్ రూపంలో ప్రజలను దండిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల ఇబ్బందులను గమనించి సమ్మెను విరమించాలని ఆయన సూచించారు.

సమ్మె వల్ల ఇప్పుడు రెండు గంటల విద్యుత్తు కోత విధిస్తున్నామని, నాలుగు గంటల కోత విధించే ప్రమాదం వచ్చి పడిందని ఆయన అన్నారు. విద్యుత్తు కొనుగోలుకు 12 కోట్ల రూపాయలు ఖర్చవుతోందని ఆయన అన్నారు. హైదరాబాదు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తాను హైదరాబాదులో పుట్టిపెరిగినవాడినని, అందువల్ల హైదరాబాదును సుందరనగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి రూపాయకు కిలో బియ్యం పథకం అమలు చేస్తామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+