తెలంగాణపై మరిన్ని సంప్రదింపుల పేరుతో వెనక్కి

తెలంగాణపై నిర్ణయానికి మరింత వ్యవధి కావాలని ఆజాద్ అన్నారు. మరిన్ని సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మొదటి దశ చర్చలు పూర్తయ్యాయని, రెండో దశ సంప్రదింపులు జరగాల్సి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రానికి చెందిన మూడు ప్రాంతాల నాయకులతో రెండు నెలల పాటు తాను చర్చలు జరిపానని ఆయన అన్నారు. తెలంగాణపై జాతీయ స్థాయి నాయకులతో, రాష్ట్రానికి చెందిన కొంత మంది నాయకులతో మాట్లాడాల్సి ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై తాము వరుస సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.
తెలంగాణపై తాను కొన్ని తెలుగు టీవి చానెళ్లను నిన్న చూశానని, తమ వైఖరి విషయంలో టీవీ చానెళ్లు రకరకాల వార్తాకథనాలను ప్రసారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. టి - చానెల్ ప్రసారం చేసిన వార్తాకథనాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏం జరుగుతోందనేది చూడకుండా, విషయాలను ధ్రువీకరించకోకుండా టీవీ చానెళ్లు వార్తాకథనాలను ప్రసారం చేస్తున్నాయని ఆయన అన్నారు.
తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా అన్నారు. చర్చల ప్రక్రియ కొనసాగుతుందని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. సమస్య తీవ్రత తమకు తెలుసునని ఆయన అన్నారు. చర్చలు సాగుతున్నాయని, ఈ రోజు కూడా చర్చలు జరిపామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications