ప్రమాదంలో మంత్రి సబితారెడ్డి మేనల్లుడి మృతి

కారులో వెంకట్రామి రెడ్డి ఒక్కరే ఉన్నారు. ఆయనతో ఎవరూ లేరు. మోకిల వరకు ఎలాంటి డివైడర్లు లేక పోవడం, అక్కడకు రాగానే డివైడర్లు ఉండటం వాటికి రేడియం గుర్తులు లేక పోవడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వెంకట్రామి రెడ్డికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఆయన వయస్సు నలభై వరకు ఉంటోంది. వెంకట్రామి రెడ్డి మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆయన స్వగ్రామానికి పంపించనున్నారు.












Click it and Unblock the Notifications