కెసిఆర్ అసలు సన్నాసి అయ్యాడు: మోత్కుపల్లి

కెసిఆర్ వల్ల తెలంగాణ రాదని మరో శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లాడో అందరికీ తెలుసున్నారు. తెలుగుదేశం పార్టీపై తెలంగాణ రాష్ట్ర సమితి గూండాలు దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కెసిఆర్ ఏ మొహం పెట్టుకొని ఢిల్లీలో ఉన్నారన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తే తెలంగాణపై తెలుగుదేశం పార్టీ మరో లేఖ ఇవ్వడానికి సిద్ధమన్నారు. తెలంగాణపై ఉద్యమిస్తున్న భారతీయ జనతా పార్టీ బాబ్లీపై ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు సోనియా ఇంటి ముందు ధర్నా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications