కెసిఆర్ అర్థరాత్రి రహస్యాలు వెల్లడించాలి: నామా

కెసిఆర్ కాంగ్రెసు నాయకులు కెసిఆర్, కె. కేశవరావు, జానా రెడ్డిలతో రహస్యంగా సమావేశమయ్యారని అందరికీ తెలుసునని ఆయన అన్నారు. తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తారని జానా రెడ్డి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, కె. కేశవరావు సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌కు చెప్పినట్లు వార్తలు వచ్చాయని, తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతుంటే కెసిఆర్ చర్యలు సరైనవి కావని ఆయన అన్నారు. తెలంగాణను మోసం చేసిందే కాంగ్రెసు పార్టీ అని ఆయన విమర్శించారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణపై ఉలుకరు, పలుకరని ఆయన వ్యాఖ్యానించారు.
కెసిఆర్ చెట్టాపట్లాల్ వేసుకుని తిరుతుంటే కాంగ్రెసు పార్టీ తెలంగాణపై ఎలా దిగొస్తుందని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అడిగారు. ఢిల్లీకి వెళ్లి కెసిఆర్ ఏం సాధించుకుని వచ్చారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ సంక్షోభం ద్వారానే తెలంగాణ సాధించగలమని తాము రాజీనామాలు చేస్తే కెసిఆర్ కాంగ్రెసుతో కలిసి పనిచేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications