తెలంగాణపై కోర్ కమిటీ చర్చలు, నిర్ణయం ఉత్తదే

తాము తీసుకునే నిర్ణయం వల్ల తలెత్తే రాజకీయ పర్యవసానాలు, కాంగ్రెస్‌కు వచ్చే లాభనష్టాలను కోర్ కమిటీ సమీక్షించినట్లు తెలిసింది. అయితే, నిర్ణయం తీసుకునే ముందు మరోసారి చర్చలు జరపాలని, భాగస్వామ్య పార్టీల అభిప్రాయాలను సేకరించాలని, ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోర్ కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర విభజనపై ఒక అభిప్రాయం చెప్పడానికి తొందర పడరాదని, తమ నిర్ణయం వల్ల తలెత్తే రాజకీయ సమస్యలపై పార్టీలోను, మిత్రపక్షాలతోనూ చర్చించి ఒక అభిప్రాయానికి రావాలని భావించినట్లు తెలిసింది.
మంగళవారం నాటి సమావేశం పూర్తిగా పార్జీ రాజకీయ ప్రయోజనాలపైనే కేంద్రీకృతమైందని, ఈ విషయంపై ఇంకా ఒక స్పష్టత ఏర్పడలేదని సీనియర్ నాయకుడొకరు చెప్పారు. అందువల్లే చర్చల వివరాలను రహస్యంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. అవసరమైతే కోర్ కమిటీ మరోసారి సమావేశమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. తెలంగాణపై పార్టీ నిర్ణయాన్ని ప్రకటించే ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించడంపై కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర విభజనకు ముస్లింల అభ్యంతరాలపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications