బిజెపిలోకి రాములమ్మ: బాంబు పేల్చిన ఆలె నరేంద్ర

Vijayasanthi and Ale Narendra
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరవచ్చునని బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఆలె నరేంద్ర గురువారం బాంబు పేల్చారు. ప్రస్తుతం ఆమె తెరాసలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో బిజెపిలోకి వచ్చే అవకాశముందన్నారు. వివిధ రాజకీయ శక్తులతో కలిసి తెలంగాణ సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక్కడి వల్లనే తెలంగాణ సాధ్యం కాదన్నారు. కాగా తాను బిజెపిలో చేరతానన్న వ్యాఖ్యలను విజయశాంతి కొట్టి పారేశారు. తనకు అద్వాని కుటుంబం దగ్గరని, తనకు పార్టీ మారే ఉద్దేశ్యం ఉంటే తానే స్వయంగా చెబుతానని అవి కేవలం తప్పుడు ప్రచారాలే అని కొట్టి పారేశారు. తెలంగాణకు బిజెపి కట్టుబడి ఉంది కాబట్టి తెరాస ఎన్డీయేలో కలిసే ఉద్దేశ్యం ఉందనే భావనతో ఆయన మాట్లాడి ఉంటారన్నారు. తాను తెరాసలో సంతోషంగానే ఉన్నానని చెప్పారు. కాగా ఆలె నరేంద్ర తెరాసలో కెసిఆర్‌తో పాటు పని చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

భాజపా సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ బస్సుయాత్ర ఆంధ్ర ప్రదేశ్‌లో చేరేకంటే ముందే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు ఈనెల 15, 16, 17 తేదీల్లో జరిగే రైలు రోకో కార్యక్రమంలో బిజెపి పాల్గొంటుందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+