ప్రశాంత్ భూషణ్‌పై దాడిన స్వాగతించిన బాల్ థాకరే

దాడిచేసినవారిలో ఒక వ్యక్తి శ్రీరాంసేనకు చెందినవాడు కాగా, మరో ఇద్దరు భగత్ సింగ్ సేనకు చెందినవారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆ గ్రూప్ మరింత మంది అన్నా మద్దతుదారులపై దాడి చేసింది. ప్రశాంత్ భూషణ్‌పై దాడి చేసిన ముగ్గురికి శుక్రవారం ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందు గురువారం తేజిందర్ పాల్ సింగ్ బగ్గా, విష్ణు గుప్తా, ఇందర్ వర్మ అనే ముగ్గురిని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు వారికి ఒక రోజు జ్యుడిషియల్ రిమాండ్ విధించిది.
ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలతో అన్నా హజారే విభేదించారు. తమ జట్టులో ప్రశాంత్ భూషణ్‌ను కొనసాగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలు సరైనవి కావని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications