చిరుకు అంత సీన్ లేదంటూ పార్టీ నేతలకు జగన్ క్లాస్

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించడంతో పార్టీ నేతల పరిస్థితి గందరగోళంలో పడినట్లుగా కనిపిస్తోంది. జగన్ పార్టీ స్థాపించి ఆరు నెలలు దాటినా ఇప్పటి వరకు ఓదార్పు యాత్రతో బిజీగా ఉన్నారు. దీంతో స్థానిక నేతలు పార్టీ నిర్మాణం గురించి అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు హఠాత్తుగా జగన్ జిల్లాల వారిగా పార్టీ సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఆయా జిల్లాల నేతలకు క్లాసులు పీకుతున్నారట. పార్టీ నిర్మాణంపై దృష్టి సారించకుంటే ఎలా అని వారిస్తున్నారట. దీంతో నేతలు ఏం చెప్పాలో తోచని స్థితిలో పడిపోయారట.

రెండు రోజులుగా జగన్ జిల్లాల వారిగా పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్ర, శనివారం కూడా మిగతా జిల్లాల సమీక్షలు నిర్వహిస్తారు. మొదటి రోజు నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, రెండో రోజు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణ జిల్లా నేతలతో సమావేశమైనప్పుడు పార్టీ సభ్యత్వ నమోదుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో నేతలు సమ్మె కారణంగా మందగించిందని సమాధానం ఇచ్చారట. ఆయితే ఆయన వారిని పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంపై ప్రశ్నించారట. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసి పార్టీని బలోపేతం చేయాలని వారికి సూచించారట.

గురువారం భేటీలో ఉత్తరాంధ్ర జిల్లా నేతలపైనా జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సమ్మె కారణంగా సభ్యత్వ నమోదు మందగించిందని కానీ మీకేమైందని ఆయన ప్రశ్నించారట. ఉభయ గోదావరి జిల్లా నేతలు చిరంజీవి అంశం తీసుకు రాగా ఆయనకు అంత సీన్ లేకే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారని అలాంటి విషయాలు పక్కన పెట్టి సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని సూచించారట. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను ప్రభుత్వం నీరుగార్చుతుందని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని ఆదేశించారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+