27 రోజుల తర్వాత రోడ్ల పైకి ఆర్టీసి బస్సులు

మరోవైపు తెలంగాణలో జరుగుతున్న సకల జనుల సమ్మె, సోమవారం జరగనున్న బందుపై చర్చించేందుకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నదని సమాచారం. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం, జెఏసి భాగస్వామ్య పక్షాలు, ఉద్యోగ సంఘాల నేతలు తదితరులు పాల్గొంటారు. సమ్మె నుండి విద్యాసంస్థలను మినహాయించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో దాని పైన కూడా చర్చించే అవకాశముంది.












Click it and Unblock the Notifications