చంచల్‌గూడ జైలుకు విజయశాంతి, ఆమరణ దీక్ష

అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అర్ధరాత్రే ఆమెను గాంధీ హాస్పిటల్ తరలించి చికిత్స చేయించారు. అనంతరం ఆమెను మళ్లీ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశ పెట్టారు. రాత్రి సమయంలో మూడు గంటల పాటు వాదోపవాదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. మరోసారి ఆదివారం ఉదయం వాదోపవాదాలు జరిగాయి. మెజిస్ట్రేట్ విజయశాంతితో పాటు మరో ఎడుగురికి ఈ నెల 22వ తేది వరకు రిమాండు విధించారు. కాగా పోలీసుల అదుపులో ఉన్న విజయశాంతి అరెస్టయినప్పటి నుండి అప్రకటిత నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చంచల్ గూడ జైలుకు తరలించిన అనంతరం నిరాహార దీక్ష అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు సిద్దిపేట శాసనసభశ్ర్యుడు హరీష్ రావును కూడా రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications