ఎమ్మెల్సీ స్థానం: చిరంజీవితో బొత్స సత్యనారాయణ భేటీ

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం అయ్యాక చిరు తరఫు నేతలకు ఎలాంటి పదవీ దక్కలేదు. చిరంజీవికి సైతం పదవులు వరిస్తాయని వాదనలు వినిపించడమే తప్ప ఇప్పటి వరకు ఆయనకు ఏ పదవీ రాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటు ఖాళీ కావడంతో పలువురు నేతలు దానిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రజారాజ్యం నుండి వచ్చిన వారు ప్రధానంగా ఈ సీటుపై కన్నేశారు. ఈ నేపథ్యంలో బొత్స చిరుతో భేటీ కావడం ప్రాధావ్యత సంతరించుకుంది. కోటగిరి విద్యాధర రావు తదితరులు ఎమ్మెల్సీ స్థానం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆర్య వైశ్య నాయకులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వైశ్యులకే ఆ స్థానం కేటాయించాలని కోరిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications