రాజీనామా చేయాలంటూ పొన్నాల ఇంటి ముట్టడి, ఉద్రిక్తం

మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇంటిని తెలంగాణవాదులు ముట్టడించారు. తెలంగాణ కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అవినీతికి వ్యతిరేకంగా తన ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్షను శనివారం విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల జనుల సమ్మె రూపంలో తెలంగాణవాదాన్ని జాతీయ స్థాయిలో వినిపిస్తే మిగతా పనిని రాజకీయ నేతలే చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ సమస్యకు రాష్ట్ర విభజనే పరిష్కారమనన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications