యడ్యూరప్పపై మరో దర్యాప్తు, కష్టాల మీద కష్టాలు

ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన అవినీతి, అక్రమ భూ వ్యవహారాలకు సంబంధించిన ఐదు కేసుల్లో రెండు కేసుల్లో యడ్యూరప్ప ప్రస్తుతం జైలులో ఉన్నారు. అప్పర్ భద్ర సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టు కట్టబెట్టడానికి ఓ ప్రైవేట్ సంస్థ నుంచి యడ్యూరప్ప 13 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారనేది ఆరో కేసు. జనతాదళ్ - సెక్యులర్ ప్రజాప్రతినిధి వైయస్‌వి దత్తా చేసిన ఫిర్యాదుపై యడ్యూరప్ప మీద ఈ కేసు నమోదైంది. తక్కువ కోట్ చేసిన సంస్థలను కాదని అత్యధికంగా కోట్ చేసిన ఆర్ఎన్ఎస్ జ్యోతికి లంచం తీసుకుని ఆ కాంట్రాక్టును కట్టబెట్టారనేది ఆరోపణ. ప్రతిగా జ్యోతి యడ్యూరప్పకు కుమారుడు రాఘవేంద్ర, అల్లుడు సోహన్ కుమార్‌లకు చెందిన ధవళగిరి డెవలపర్స్ లిమిటెడ్‌కు 13 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications