హైదరాబాదుకు అమెరికా టెక్కీల మృతదేహాలు

కాగా అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలుగువాళ్లు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. నలుగురిలో ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. వీరు ముగ్గురు కూడా మిరాకిల్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన ఓ విద్యార్థి తప్పతాగి రాంగ్ రూటులో వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో తెలుగువాళ్లు ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దెబ్బ తిని కాలిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. మృతుల్లో వెంకటాచలం, సత్యేంద్ర, సుమంత్, రాజేంద్రప్రసాద్ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ వెంకటాచలం మామ. తనకు మనవరాలు పుట్టడంతో ఆయన అమెరికాకు వచ్చారు.












Click it and Unblock the Notifications