ప్రేమానురాగాలతో విడిపోవాలి, ద్వేషాలు వద్దు: డిఎస్

D Srinivas
హైదరాబాద్: ఇరు ప్రాంతాలు ప్రేమానురాగాలతో విడిపోవాలని, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు కూడదని ఎమ్మెల్సీగా ఎన్నికైన పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణకు తాను కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునేవాడిలో తానొకడినని, దాన్ని బయటపెట్టే విషయంలో ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కరకంగా ఉంటుందని, తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు చోటు చేసుకోకుండా విభజన జరగాలనేది తన అభిమతమని ఆయన అన్నారు.

అసాధారణ పరిస్థితుల్లో తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదని ఆయన మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా అన్నారు. సాధారణ స్థితిలోనే తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని, రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా వెళ్లిపోవడం వల్ల ఖాళీ అయిన స్థానానికి పార్టీ అధిష్టానం తనను ఎంపిక చేసిందని ఆయన చెప్పారు. ప్రత్యేక పరిస్థితేమిటో తనకు తెలియదు గానీ సాధారణ స్థితిలోనే తన ఎంపిక జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణకు సంబంధించి నిబద్ధత అనేది రోజు రోజుకు మారదని, తెలుగు ప్రజలు అవగాహనతో, సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది లేదని, ముఖ్యమంత్రి బాగానే పనిచేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రతిష్టను పెంచడానికి తాను కృషి చేస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+