టిఆర్ఎస్ ఎమ్మెల్యేల దీక్షకు బిజెపి, సిపిఐ దూరం

ఇప్పుడు చేపట్టే దీక్షలు కూడా తమ రాజకీయ మైలేజికి ఏవిధంగానూ ఉపయోగపడవని భావించే ఆ పార్టీలు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ యాత్ర పార్టీ తెలంగాణ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అద్వానికి తెలంగాణలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎంతగా అంటే బిజెపికి వచ్చిన స్పందన చూసి టిఆర్ఎస్ తీవ్రంగా మథన పడిందట. ఎలాగూ జెఏసిలో తమ మాట అంతగా చెల్లుబాటు కావడం లేదు, అందులోని ప్రతి కార్యక్రమం క్రెడిట్ టిఆర్ఎస్‌కే వెళుతోంది. కాబట్టి సొంత కార్యాచరణతో ముందుకు వెళ్లాలని బిజెపి వర్గాలు భావిస్తున్నట్లుగా సమాచారం. ఇందుకోసం స్థానిక నాయకుల నుండి రాష్ట్ర అధిష్టానానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయట. అయితే బిజెపి సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర రావు మాత్రం తాము జెఏసిలో పెద్దన్న పాత్ర పోషిస్తామని, జెఏసి నుండి బయటకు వెళతామనే వాదనలు ఉద్యమాన్ని దెబ్బతీయడంలో జరుగుతున్న కుట్ర అని శుక్రవారం అన్నారు. సిపిఐ కూడా గులాబి దండును నమ్ముకోవడం కంటే సొంత కార్యాచరణతో ముందుకెళ్లడమే ఉత్తమమనే భావనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications