నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా: కెసిఆర్‌కు బాబు సవాల్

ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చుని అనర్హులకు టెండర్లు కట్టబెట్టారన్నారు. కెసిఆర్ మాటలు చూస్తుంటే బాధేస్తుందని అయినా ప్రజల కోసమే భరిస్తున్నానన్నారు. తనకు బినామీ ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే తన ఆస్తులు వారికే రాసిస్తానన్నారు. తన ఆస్తులు ప్రకటించిన తర్వాత కొందరు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలన్నారు. పోలవరం అంచనాలు నెల రోజుల క్రితం రూ.600 కోట్లకు పెంచి ఇప్పుడు డబ్బులు మిగిలాయంటున్నారని విమర్శించారు.
తాము పోలవరం టెండర్ల అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా తొమ్మిది గంటల విద్యుత్, ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామన్నారు. రైతుల సమస్యల కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. రైతులు రోడ్డెక్కితే కానీ ప్రభుత్వాలు దిగి వచ్చేలా కనిపించడం లేదన్నారు. తన రైతు పోరుబాట రాజకీయ ప్రయోజనాల కోసం కాదన్నారు. కరెంటు కోతల వల్ల లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications